calender_icon.png 29 October, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రోల్‌బంకు కార్మికుడికి రోబోటిక్ కిడ్నీ మార్పిడి

29-10-2025 01:41:59 AM

  1. కామినేనిలో తొలిసారి ఈ తరహా శస్త్రచికిత్స

అత్యంత కచ్చితత్వంతో చేసిన సీఎంఆర్ రోబో

ఈ రోబోతో ప్రపంచంలో ఇదే మొదటి కిడ్నీ మార్పిడి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రంగారెడ్డి అనే వ్యక్తి ఓ పెట్రోలుబంకు కార్మికుడు. అతడి వయసు 45 ఏళ్లు. అయితే, అధిక రక్తపోటు (బీపీ) ఉన్న విషయాన్ని సరిగా గమనించుకోలేదు. గుర్తించేసరికే రెండు కిడ్నీలు పాడైపోయాయి. కొన్నాళ్లుగా డయాలసిస్ చేయించు కుంటూ కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నించాడు. కుటుంబసభ్యులలో ఎవరిదీ సరిపోక పోవడంతో జీవన్‌దాన్‌లో పేరు నమోదుచేయించుకున్నాడు.

అందులో కిడ్నీ అందు బాటులోకి రావడంతో ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి. సూర్యప్రకాష్ తెలిపారు. “సాధారణ శస్త్రచికిత్సలో అయితే పెద్ద కోత పెట్టాల్సి రావడం, ఇతర సమస్యలు ఉంటాయని.. సీఎంఆర్ సర్జికల్ రోబోతో అతడికి కిడ్నీ మార్పిడి చేయాలన్న నిర్ణయానికి వచ్చాం.

కామినేని ఆస్పత్రిలో రోబోటిక్ పద్ధతిలో కిడ్నీమార్పిడి చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు.. సీఎంఆర్ రోబోతో ఈ శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. దీన్ని విజయవంతంగా నిర్వహించాం. రోబోటిక్ పద్ధతి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా చిన్న కోత, కణజాలాలకు నష్టం తక్కువ ఉండడం, రక్తస్రావం కూడా అతి తక్కువ ఉండడం లాంటి ప్రయోజనాలుంటాయి.

పైపెచ్చు కచ్చితత్వం నూటికి నూరుశాతం ఉంటుంది. రోబోటిక్ ఆరమ్స్‌ను ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేయ డం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండదు. నొప్పి చాలా తక్కువ ఉండడంతో ఆస్పత్రిలో ఎక్కువ కాలం ఉండక్కర్లేదు, వేగంగా కోలుకుని తమ పనులు చేసుకోవచ్చు. ఊబకా యం ఉన్నవారికి ఇది మరింత సానుకూ లం” అని చెప్పారు. కామినేని ఆస్పత్రిలో ఉన్న సీఎంఆర్ వెరిసస్ సర్జికల్ రోబో అనేది అత్యంత ఆధునికమైన రోబోటిక్ వ్యవస్థ.

దీని సాయంతో రోబోటిక్ రాడికల్ ప్రోస్టేటెక్టమీ, రాడికల్ సిస్టో ప్రోస్టేటెక్టమీ, ఇంట్రా కార్పొరియల్ యూరినరీ డైవర్షన్, పైలోప్లాస్టీ, పార్షియల్ నెఫ్రక్టమీ లాంటి ఆధునిక శస్త్రచికిత్సలన్నీ పూర్తి కచ్చితత్వంతో విజయవంతంగా చేయొచ్చు అని డాక్టర్ వి.సూర్య ప్రకాష్ వివరించారు.

సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎ. డాక్టర్, ఎ. సంతోష్ కుమార్ మాట్లాడుతూ, “బీపీ తెలియకుండానే నష్టం చేస్తుంది. దానివల్ల దీర్ఘకాలంలో కిడ్నీలు పాడవ్వడం లాంటి సమస్యలు చాలా వస్తా యి. రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. రోబోటిక్ సర్జరీ అయితే ఐదు రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు, మొదటిరోజే నడిపిస్తారు కూడా” అన్నారు.