calender_icon.png 29 October, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగ్రత్తలతో బ్రెయిన్ స్ట్రోక్ నివారణ

29-10-2025 01:40:30 AM

  1. చికిత్సతో పక్షవాతం శాశ్వతం కాదు
  2. కేర్ ఆస్పత్రి వైద్యులు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): బుధవారం ప్రపంచ బ్రెయి న్ స్ట్రోక్ దినోత్సవంగా పాటించనున్నారు. స్ట్రోక్‌పై ప్రజల్లో అవగాహన పెంచడం, నివారణ చర్యలను ప్రోత్సహించడం, ముందస్తు గా గుర్తించి సకాలంలో చికిత్స పొందడం వంటి అంశాలపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, అకాడెమిక్స్ హెడ్, సీనియర్ కన్సల్టెంట్- న్యూరాలజిస్ట్ డాక్టర్ ఉమేష్ టి తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. “ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో స్ట్రోక్ ఒకటి. భారతదేశంలో కూడా ఇది మరణా లు, వికలాంగతకు ప్రధాన కారణంగా మా రింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మంది లో సుమారు 262 మందికి, పట్టణ ప్రాం తాల్లో ప్రతి లక్ష మందిలో 424 మందికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేయబడింది.

మెదడుకు రక్త సరఫరా తగ్గినప్పుడు లేదా అంతర్లీన ప్రమాద కారకాల కారణంగా రక్త నాళాలు లీక్ అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, మద్యం, ఊబకాయం, గుండె సమస్యలు, జన్యుశాస్త్రం సాధారణ ప్రమా ద కారకాలలో ఉన్నాయి. సాధారణ లక్షణాలు ఆకస్మిక అవయవాల బలహీనత, ముఖం వాలిపోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, అసమతుల్యత, వాంతు లు లేదా ఆకస్మిక స్పృహ కోల్పోవడం.

అకస్మాత్తుగా ముఖం వంగిపోవడం, చేతికి బలహీనత రావడం లేదా మాట్లాడటంలో ఇబ్బంది కలిగితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లండి. అన్ని స్ట్రోకులు ఒక్కసారిగా తీవ్రమైన లక్షణాలతో కనిపించవని తెలిపారు. చాలాసార్లు చిన్న చిన్న రక్తగడ్డల వల్ల నిశ్శబ్దంగా స్ట్రోకులు వస్తాయని చెప్పారు. వీటివల్ల కాలక్రమంలో జ్ఞాపకశక్తి తగ్గడం, అభిజ్ఞా క్షీణత, నెమ్మదిగా కదలికలు, తలనొప్పి, తిమ్మిరి లేదా నడకలో అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి” అని వివరించారు.

ఇలాంటి నిశ్శబ్ద స్ట్రోకులు సాధారణ స్కాన్ల ద్వారానే గుర్తించగలము. చిన్న సంకేతాలను గుర్తించడం, క్రమం తప్పకుండా తనిఖీలు చేయిం చడం దీర్ఘకాలిక సమస్యలను నివారించడంలో చాలా ము ఖ్యం అని డాక్టర్ కైలాస్ మిర్చే సూచించారు. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో ఉన్న  ఎన్‌ఎబిహెచ్  గుర్తింపు పొందిన అడ్వాన్స్ స్ట్రోక్ సెంట ర్ ద్వారా రోగులకు వేగవంతమైన చికిత్స అం దించబడు తోంది.

క్లాట్-బస్టింగ్ థెరపీ (థ్రోంబోలిసిస్), థ్రోంబెక్టమీ, స్టెంటింగ్, న్యూరో -రిహాబి లిటేషన్ వంటి సమగ్ర స్ట్రోక్ సేవలు అందుబాటులో ఉన్నాయని కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ క్లినికల్ డైరెక్టర్ మరియు న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ కె జైస్వాల్ తెలిపారు. స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి నాలుగు గంటలు ‘గోల్డెన్ విండో‘ అని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయం మెదడు పనితీరును కాపాడటంలో, శాశ్వత వైకల్యాన్ని నివారించడంలో చాలా కీలకం. 

సమయాన్ని మిస్ చేస్తే, తిరిగి కోలుకోలేని మెదడు గాయం జరగే ప్రమా దం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వారు, లేదా 30 ఏళ్లు పైబడిన వయసులో ధూమపానం చేసే వారు, మద్యం సేవించే వారు తమ రక్తపోటు, చక్కెర స్థాయిలను క్రమం తప్పకుం డా పరీక్షించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంతో అవసరం.