08-01-2026 12:12:50 AM
మధర్ థెరిస్సా కాలనీ అధ్యక్షుడు బూడిద వెంకటేష్
జవహర్‌నగర్, జనవరి 7 (విజయక్రాంతి): వృద్ధులను, అనాధలను అభాగ్యులను ఆదుకుంటేనే జీవితానికి ఒక సార్ధకత చేకూరుతుందని జవహర్ నగర్ మదర్ తెరిసా కాలనీ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ తెలిపారు. బృహత్ మహానగర పరిధిలోని జవహర్ నగర్ మదర్ తెరిసా కాలనీలో కాలనీ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ ఆధ్వర్యంలో బుధవారం గ్రేస్ సొసైటీ ఆధ్వర్యం లో 50 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పేద మహిళలకు, వృద్ధులకు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీషన్, ఎం జూకోబ్ ,కోఆర్డినేటర్ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం రమేష్, వైస్ ప్రెసిడెంట్ కే. అనసూయ, బస్తీ దవఖాన డాక్టర్ రిషిక, డాక్టర్ డియాస్ ,సామాజిక సేవకురాలు మామిడి మంజుల, ఎం రవి, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.