calender_icon.png 30 July, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్

29-07-2025 05:08:14 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని కేజీబీవీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. వివిధ పాఠ్యాంశాలలో ప్రశ్నలు సంధించి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. హాస్టల్, వంటగది, పరిసరాలను పరిశీలించి మధ్యాహ్న భోజన వంటకాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారం పరిశుభ్రంగా వంటచేసి అందజేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించే లేదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి ఉన్నారు.