29-07-2025 05:10:50 PM
హుజూర్ నగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు..
హుజూర్ నగర్: గురుకుల కళాశాలలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ దున్న వెంకటేశ్వర్లు(College Principal Dunna Venkateswarlu) అన్నారు. మంగళవారం పట్టణంలోని గురుకుల కళాశాలలో ఆయన మాట్లాడారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మంచి భోజన వసతి, ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులతో ప్రత్యేకత బోధన అన్నారు. ప్రవేశం పొందే విద్యార్థులు ఈనెల 31 వరకు కళాశాల ఆవరణలో జరిగే ఎంపికకు పదో తరగతి మార్కులతో పాటు, కుల ధృవీకరణ పత్రం తీసుకురావాలని అన్నారు. ఎంపీసీ, బైపీసీ ఫస్టియర్‌లో సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ లలో ప్రతిభ కనబరుస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.