calender_icon.png 16 December, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కసారి అవకాశం ఇవ్వండి

16-12-2025 12:40:30 AM

  1. గ్రామ అభివృద్ధికై సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా..

ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో జోరుగా ప్రచారం

గ్రామంలో హోరా హోరీగా సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం

బుట్టాయిగూడెం గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొండగొర్ల వెంకటయ్య

కన్నాయిగూడెం,డిసెంబర్ 15 (విజయక్రాంతి): కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొండగొర్ల వెంకటయ్యఇంటి ఇంటికి తిరుగుతూ అమ్మ ఒకసారి అవకాశం ఇవ్వండి,మన బుట్టాయిగూడెం గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా అంటూ ఓటర్లను హామీ ఇచ్చారు పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థుల అభ్యర్థన.

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం చివరి రోజు కావడంతో  ప్రచారంలో జోరు పెంచారు. ఈ నెల 17,న మూడోవ దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

పగలు రాత్రి ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్

అభ్యర్థులు ఓ వైపు పగలు ముమ్మర ప్రచారం చేస్తూనే రాత్రి వేళల్లో వివిధ వర్గాలతో సమావేశమవుతున్నారు. సమభావన సంఘాల మహిళలు, కాల నీ సంఘాలు, కాలనీ ప్రజలతో భేటీ అవుతున్నారు. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

గెలిస్తే చేయాల్సిన పనులపై హామీలు ఇస్తు ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు బుట్టాయిగూడెం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతి ఒక ఒటరు అభివృద్ధి వైపు వస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచు అభ్యర్థి కొండగొర్ల వెంకటయ్య ఉంగరం గుర్తుకు సమయస్ఫూర్తిగా ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు