calender_icon.png 1 November, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు బహుమతుల ప్రధానం

31-10-2025 08:06:01 PM

ఎస్ఐ ఆధ్వర్యంలో 2కె రన్, వ్యాసరచన పోటీలు

పాపన్నపేట,(విజయక్రాంతి): జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యాసరచన పోటీలు, ఉదయం 6 గంటలకు 2కె రన్ పోటీలు నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముందుగా ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు బహుమతులను ఎస్సై చేతులమీదుగా ప్రధానం చేశారు.