calender_icon.png 6 December, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సమ్మిట్.. ఆర్థిక సదస్సు

06-12-2025 12:10:10 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాబో యే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని అన్నారు.

ప్రజా భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లు, వరుసగా రెండు రోజుల ప్రోగ్రాం షెడ్యూల్ గురించి అధికారులు సీఎంకు వివరించారు. విజన్ డాక్యుమెంట్‌ను తుది రూపు ఇచ్చేందుకు సీఎం పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్ వృద్ధి ప్రణాళికలను ప్రాధా న్యంగా చేర్చాలని, ఈ పత్రాన్ని ప్రజలకు డిజిటల్‌గా అందుబాటులో ఉంచాలని ఆదేశిం చారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఈ గ్లోబల్ సమ్మిట్ విజయాన్ని ప్రదర్శించాలనే తన ఆలోచనను సీఎం వివరించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మం త్రులతో కలిసి రేపు గ్లోబల్ సమ్మిట్  మినిట్ టూ మినిట్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విమానాల రద్దు నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చి, వెళ్లే విమాన సౌకర్యాలపై ఎటువంటి ఇబ్బందులు రాకుండా పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.