06-12-2025 12:07:41 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణకు చెందిన 10 మంది విద్యార్థులు అలబామా రాష్ట్రం బర్మింగ్‌హామ్‌లోని అలబామా యూనివర్సిటీలో చదువుకుంటు న్నారు. వారంతా ఒకే భవనంలో ఉంటున్నారు. విద్యార్థులు ఉంటున్న భవనంలోనే ప్రమాదవశాత్తు మం టలు చెలరేగడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మిగిలిన విద్యార్థులను అగ్నిమా పక సిబ్బంది రక్షించినట్టు తెలుస్తున్నది.