09-05-2025 08:21:16 PM
6,757 సంఘాలకు 599 కోట్ల రుణాలు
మహబూబాబాద్,(విజయక్రాంతి): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 2023 24 ఆర్థిక సంవత్సరంలో 6,757 సంఘాలకు 599 కోట్ల రూపాయలను బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించి మహబూబాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కడారి స్వరూప, డిఆర్డిఏ పీ డీ మధుసూదన్ రాజ్, చిన్న గూడూరు ఏపీఎం పాపయ్యను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కే.వీరబ్రహ్మచారి అభినందించారు. బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించడంతోపాటు, 11,623 మహిళా సంఘాలకు 22 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ ఇప్పించడానికి సెర్ఫ్ చేసిన కృషిని అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదేవిధంగా పనిచేసే మహిళా సంఘాలను ప్రార్ధికంగా పరిపుష్టి సాధించే విధంగా కృషిచేసి, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా అండగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.