09-05-2025 08:33:23 PM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ అన్నారు. శుక్రవారం పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ... తనిఖీలు చేస్తున్న సమయంలో ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించి నడిపిన వాహనాలను సీజ్ చేసి వాహన దారులకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్,సీటు బెల్టు ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ట్రిపుల్ రైడింగ్ నేరమని, మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలు చోటుచేసుకుంటే సంబంధిత వాహన యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.