calender_icon.png 10 May, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ఇద్దరు యువకుల దుర్మరణం

09-05-2025 08:37:37 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ శివారులో జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రెండు సైకిల్ మోటార్లు ఢీకొని మరిపెడ మండలం బావోజీ గూడెంకు చెందిన భూక్య సంతోష్ (19) , గుగులోతు కార్తీక్ (22) దుర్మరణం పాలయ్యారు. అలాగే అదే గ్రామానికి చెందిన అజ్మీర సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన తెలుసుకున్న మరిపెడ ఎస్సైలు సతీష్, అంజమ్మ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ సురేష్ ను ఆసుపత్రికి తరలించారు. మృతుడు కార్తీక్ తండ్రి లాలూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.