calender_icon.png 15 July, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనుల వేగవంతానికి ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో సందర్శించాలి

15-07-2025 12:44:15 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్,జూలై14(విజయక్రాంతి):జిల్లాలో పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు వంటి అభివృద్ధి పనులపై ఎంపిడివోలు క్షేత్రస్థాయిలో సందర్శించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులు, ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో మౌలిక వసతుల కల్పన, కిచెన్ షెడ్ టాయిలెట్, ప్రహరీ గోడ వంటివి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో సందర్శించి ప్రతి పనినీ పర్యవేక్షించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న పలు ప్రభుత్వ భవనాలు కమ్యూనిటీ హాళ్లలో మరమ్మతులు చేపడుతున్నామని, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, జిల్లా సంక్షేమ అధికారి ఈ పనులను పర్యవేక్షిస్తూ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలనిఆదేశించారు.