06-01-2026 12:00:00 AM
హనుమకొండ, జనవరి 5 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ఓబీసీ సేవాదళ్ రాష్ట్ర నాయకుడు గోదాసి చిన్న జన్మదినం పురస్కరించుకుని 16వ డివిజన్, గరీబ్ నగర్ లో మిత్ర మండలి ఆధ్వర్యంలో భారీ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. లక్ష్మీ గణపతి నేత్ర వైద్యశాల, సుస్మిత దంత వైద్యశాల, అంబేద్కర్ స్మారక ధార్మిక వైద్యశాలల సహకారంతో సుమారు 400 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, ఉచితంగా ఔషధాలు పంపిణీ చేశారు.
దృష్టి లోపమున్న 100 మందిని గుర్తించిన వైద్యులు వారికి హైదరాబాద్ లో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు ప్రకటించగా, మరో 50 మందికి దంత చికిత్సలు అందించారు. పుట్టినరోజు వేళ సేవా కార్యక్రమాలు చేపట్టిన చిన్నను అభిమానులు గజమాలతో సత్కరించి అంబేద్కర్ జ్ఞాపికను అందజేశారు. జాన్పాక, ధర్మారం గ్రామాల్లో పండ్లు పంపిణీ చేసి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దాసరపు సారన్న, చెక్క రమేష్, గోదాసి వీరేశం, శివరాత్రి సురేష్, శేఖర్, గండికోట సంతోష్, నాగరాజు, సంజు, బైకని శ్రీధర్, రాజ్ కుమార్, వడ్లూరి సాయి, జన్ను రాజు, నూర్జహాన్, ముద్దాసాని ఇందిర, ఉస్మాన్, అయాన్, బబ్బు, బబ్లు, యుగంధర్,నవాజ్,శివ, పవన్, రేవూరి అభిమానులు పాల్గొన్నారు.