06-01-2026 12:00:00 AM
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘటన
సిద్దిపేట క్రైం, జనవరి 5(విజయక్రాంతి) : సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్నబి.లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన కేసులో నిందితుడిని అరె స్టు చేసినట్టు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. అదే కాలేజీలో జనరల్ మెడిసిన్ చదువుతు న్న సికిందరాబాద్ ఆల్వాలకు చెందిన ప్రణ య్ తేజ్‌ను లావణ్య ఆత్మహత్యకు కారకుడిగా గుర్తించినట్టు చెప్పారు.ఇందుకు సం బంధించిన పూర్తి వివరాలను ఏసీపీ వెల్లడించారు.
జోగులాంబ గద్వాల జిల్లా మా నోపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన లావణ్య (23) ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ప్రాధమిక విద్య, హైదరాబాద్ గచ్చిబౌలిలో గలగౌలిదొడ్డి క్యాంపస్ నందు ఇంటర్ పూర్తి చేసి మొదట ప్రయత్నంలోనే 2020లో సిద్దిపేట ప్రభుత్వ మెడి కల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరింది.కోర్సుపూర్తి చేసిన లావణ్య అదే ఆస్పత్రిలో ఇంట ర్న్‌షిప్ చేస్తోంది.
అదే మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ చదువుతున్న ప్రణయ్ తే జ్‌తో గత సంవత్సరం జూలైలో పరిచ యం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగిన ప్రణయ్ వేర్వేరు కులాల కారణంగా నిరాకరింరాడు.దీంతో లావణ్య తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 3న గడ్డి నివారణకు వాడే పారాక్విట్ మం దును ఇంజక్షన్ చేసుకోవడంతో అపస్మారక స్థితికి వెళ్లింది.
గమనించిన రూమ్ మేట్స్ వెంటనే సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ విషయమై లావణ్య అక్క శిరీష ఫిర్యాదు చేయడంతో సిద్దిపేట త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టుకు తరలించినట్టు తెలిపారు.