02-09-2025 12:37:24 AM
- మిడ్ మానేరు, ఎల్‌ఎండీ నుంచి నేడు నీటి విడుదల
- మూడు నెలల వర్షపాతం సాధారణం
కరీంనగర్, సెప్టెంబరు 1 (విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు జ లకళ సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో వరద నీరు ప్రాఎక్టులకు పోటెట్టింది. గోదావరి ఉధృతి ఇంకా కొనసాగు తుంది. రామగుండం పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.33 69 టీఎంసీలుగా ఉంది. ఎస్సారెస్పీ, కడెంతోపాటు గోదావరి ద్వారా 3,33,025 క్యూ సెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
62 గేట్లకుగాను 12 గేట్లకు తెరిచి 3,32,747 క్యూసె క్కులను దిగువకు వదులుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు నుంచి ఇదే జిల్లాలోని బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి వరదనీరు చేరుకుతన్నది. ఎగువ మానేరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2 టీఎంసీలకు చేరుకున్నాయి. ఇన్ 3823 క్యూసెక్కులు కాగా 3823 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరుకు వదులుతున్నారు.
అలాగే ఇదే జిల్లాలోని అన్నపూర్ణ జలాశయం నీటి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా 1.79 టీఎంసీలకు చేరుకుంది. మిడ్ మానేరు నుండి 12,800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం ప్యాకేజీ-11కు అవుట్ ఫ్లో ద్వారా 9900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు(రాజరా జేశ్వర) నీటి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.759 టీఎంసీలకు చేరుకుంది. 17,455 క్యూసెక్కుల నీరు ఎస్సారెస్పీతోపాటు ఎగువ మానేరు నుండి వచ్చి చేరుతుంది.
ఈ ప్రాజెక్టు గేట్లు మరోమారు మంగళవారం తెరవనున్నారు. వరదనీరు వచ్చి చేరుతుండడంతో తాగునీటి అవసరాలకు మూడు నాలుగు రోజుల వరకు ఉపయోగించకూడదని ఎస్సారెస్పీ అధికారులు ఒక ప్రకటనలో సూచించారు. ఎల్‌ఎండీనీటి సామర్ధ్యం 24,034 టీఎంసీలు కాగా 21.4 64 టీఎంసీలకు చేరుకుంది. మిడ్ మానేరుతోపాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కెనాల్ ద్వారా 3075 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
- ఆగస్టులో ఆశాజనంగా వర్షాలు...
ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, రా జన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఆగస్టు నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది. జూన్, జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. ఈ మూడు నెలల వర్షాన్ని పరిశీ లిస్తే నాలుగు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే కొద్దిపాటి ఎక్కుగా నమోదయింది. కరీంనగర్ జిల్లాలో మూడు నెలల సాధార ణ వర్షపాతం 572.4 మిల్లీ మీటర్లు కాగా 6 66.7 మిల్లీ మీటర్లు నమోదయింది. ఇది సా ధారణంకంటే 16 శాతం అధికం.
అలాగే రా జన్న సిరిసిల్ల జిల్లాలో మూడు నెలల సాధారణ వర్షపాతం 558.5 మిల్లీ మీటర్లు కాగా 607.9 మిల్లీ మీటర్ల నమోదయింది. ఇది సాధారణం కంటే 9 శాతం అధికం. జగిత్యా ల జిల్లాలో సాధారణ వర్షపాతం 683 మిల్లీ మీటర్లు కాగా 700.8 మిల్లీ మీటర్లు నమోదయింది. ఇది సాధరణం కంటే 3 శాతం అధికం. పెద్దపల్లి జిల్లాలో 692.9 మిల్లీ మీటర్లు కాగా 620.7 మిల్లీ మీటర్లు నమోదయింది. -10 శాతం నమోదైనా వాతావరణ లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతంనమోదయింది..