calender_icon.png 25 November, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్రౌపదిదేవి వచ్చింది!

25-11-2025 12:25:13 AM

రిచర్డ్ రిషి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ద్రౌపది2’. మోహన్ జీ దర్శకత్వంలో ఈ సినిమాను నేతాజీ ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి కథానాయిక రక్షణ ఇందుచూడన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆమెను ‘ద్రౌపదిదేవి’గా పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఇందులో రక్షణ లుక్ ఎంతో గాంభీర్యంగా, హుందాగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్; కెమెరా: ఫిలిప్ ఆర్ సుందర్; స్టంట్స్: యాక్షన్ సంతోష్; డైలాగ్స్: సామ్రాట్; ఎడిటర్: దేవరాజ్ ఎస్; ఆర్ట్: ఎస్ కే. 

--నాకు ముందు నుంచీ పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. తర్వాత సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు మా గురువు కృష్ణవంశీకి ఫ్యాన్‌గా మారిపోయా. ఆయన నాకో గొప్ప మాట చెప్పారు. ‘నీకు నేనంటే కాదు సినిమా అంటే ఇష్టం. సినిమా పట్ల ఇష్టంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను దానికి ఒక పరికరంలా ఉపయోగపడ్డాను. ఇకపై నువ్వు సినిమానే ప్రేమించాలి’ అని! ఆ మాట నన్ను చాలా కదిలించింది.