24-01-2026 12:04:23 AM
సూర్యాపేట, జనవరి 23 (విజయక్రాంతి) : జిల్లాలోని పిల్లలమర్రి శివాలయంలో వసంత పంచమి వేడుకలను శుక్రవారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివాలయంలోని శ్రీ సరస్వతి అమ్మవారికి అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణలు చేయగా మహిళలు కుంకుమ పూజలు చేశారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
అంగన్వాడి కేంద్రంలో
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జనవరి 23: మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కర్నాటి వెంకన్న బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అంగ న్వాడీ కేంద్రంలోని చిన్నారులకు పలకలను పంపిణీ చేసి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం బి నీరజ,అంగన్వాడి టీచర్ పుష్పలత, వార్డు సభ్యులు తవిటి సైదులు, మూడవత్ తనీష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
రంగాపురం పాఠశాలలో
గరిడేపల్లి, జనవరి 23: మండలంలోని రంగాపురం పాఠశాలలో వసంత పంచమి వేడు కను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.చిన్నారులను అమ్మ ఒడి నుంచి పాఠశాలకు చేరిన ఎనిమిది మంది విద్యార్థులకు పుష్పాలతో స్వాగతం పలికారు.సరస్వతి మాత జన్మదిన సందర్భంగా క్షయం లేని ’ అక్షరం’ చదువు యొక్క అవశ్యకతను వివరిస్తూ..
చిన్నారులకి ఉపాధ్యాయులు చారుగండ్ల రాజశేఖర్ అవగాహన కల్పించారు. నేటి బాలలే రేపటి పౌరులుగా భవిష్యత్తు తరాలకు పునాదులుగా తీర్చబడతారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామిశెట్టి లక్ష్మయ్య,అంగన్వాడి ఉపాధ్యాయురాలు పోటు సుగుణ పలువురు పాల్గొన్నారు