calender_icon.png 22 November, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో కళకళలాడిన అమ్మవారి ఆలయాలు

09-02-2025 11:10:49 PM

అశ్వారావుపేట (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో గల అమ్మవారి ఆలయాలు ఆదివారం భక్తులతో కోలాహలంగా మారాయి. ఎంతో ప్రసిద్ది గాంచిన వినాయకపురం చిలకల గండి ముత్యాలమ్మ ఆలయానికి భక్తులు బారీగా తరలివచ్చారు. పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న గుబ్బలమంగమ్మ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

భక్తులతో అటవీ ప్రాంతం అంతా సందడిగా మారింది. ఆలయానికి పెద్ద ఎత్తున వాహనాలు రావటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నారాయణపురంలోని కట్ట మైసమ్మ దేవాలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. గుర్రాల చెరువులో గల అమ్మవారి ఆలయం వద్ద జరిగిన చిన్నారుల పుట్టిన రోజు వేడుకులకు మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదాంతపురం అటవీ ప్రాంతంలో గల వనదుర్గా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసారు.