calender_icon.png 27 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా హక్కు రక్షణలో ప్రభుత్వం

27-09-2025 12:28:46 AM

డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): విజయ్ డెయిరీ క్వార్టర్స్ పరిధిలో ఉన్న ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో, విజయ్ డెయిరీ యాజమాన్యం పాఠశాలను తరలించాల్సిందిగా స్కూల్ యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ సభ్యులు కలిసి నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డిని, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్‌రెడ్డిని తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా శ్రీలతశోభన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ పాఠశాలను ఒకవేళ తరలిస్తే, వందలాది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే స్థోమత లేనందున అనేక చిన్నారులు చదువు మానే సి చైల్ లేబర్ వైపు వెళ్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే, విద్యా హక్కు రాజ్యాంగపరమైన హక్కు అని, ప్రతి పేద పిల్లవాడి భవిష్యత్తు రక్షించడానికి ప్రభు త్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె గుర్తు చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలియజేసి తక్షణ చర్యలు తీసుకు నేలా చూస్తాను అని స్పష్టం చేశారు. కాంగ్రె స్ ప్రభుత్వం విద్యా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.