15-11-2025 12:00:00 AM
25మీ. పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం
కైరో, నవంబర్ 14 : వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ అదరగొడుతోంది. గత కొంత కాలంగా అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న ఇషా సింగ్ తాజాగా ఈ మెగాటోర్నీలో పతకాలు కొల్లగొట్టింది. మిక్సిడ్ ఈవెంట్‌లోనూ, టీమ్ ఈవెంట్‌లోనూ రజతాలు సాధించిన ఇషా ఇప్పుడు వ్యక్తిగత విభాగంలోనూ సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది.
ఆసక్తికరంగా సాగిన ఫైనల్స్‌లో ఇషా 30 పాయింట్లు స్కోర్ చేసి మూడో ప్లేస్‌లో నిలిచింది. కొరియా షూటర్ జిన్ యాంగ్ స్వర్ణం, చైనా షూటర్ కియున్ యో రజతం సాధించారు. కాగా ఇషా సింగ్ ఇప్పుడు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అన్ని పతకాలు సాధించినట్టయింది. 2023 చాం పియన్‌షిప్‌లో 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన ఆమె ఈ సారి టీమ్, మిక్సిడ్ టీమ్ ఈవెంట్స్‌లో రజతాలు గెలుచుకుంది.
తాజా మెడల్‌తో వరల్డ్ షూటిం గ్‌లో ఇషా సరికొత్త రికార్డు అందుకుంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా షూటర్‌గా చరి త్ర సృష్టించింది. కాగా ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ ఇప్పటి వరకూ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలు కలిపి మొత్తం 12 పతకాలను గెలుచుకుంది.