calender_icon.png 28 October, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఓడితేనే మంచిరోజులు

28-10-2025 01:20:55 AM

-ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు

-రాష్ట్రంలో వారి పరిస్థితి దయనీయం

-బీఆర్‌ఎస్ కాంగ్రెస్ మెడలు వంచుతుంది..

-హామీలు అమలు చేసేవరకు పోరాడుతుంది..

-మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాం తి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి వస్తుందని, ఆ తర్వాతే ఆటోడ్రైవర్లకు మంచిరోజులు వస్తాయని, ప్రభుత్వం వారికిచ్చిన హామీలు నెరవేరుస్తుందని మాజీ మంత్రి హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని కోకాపేట నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియే టర్ వరకు ఒక ఆటోలో ప్రయాణించారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆయ న మరో ఆటోలో ప్రయాణించారు. హరీశ్‌రావు ఈ సందర్భంగా మొదటి ఆటో డ్రైవర్ రమేశ్‌తో హరీశ్‌రావు ముచ్చటించి సాధక బాధకాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా డ్రైవర్ రమేశ్ మాట్లా డుతూ.. ‘బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ల జీవితం బాగుండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి మా పొట్టకొట్టింది. పథకం ఆటో డ్రైవర్ల కుటుంబాలను దిగజార్చింది. కొందరు అప్పు ల బాధతో ప్రాణం తీసుకుంటున్నాడు’ అని వాపోయాడు. అలాగే రెండో ఆటోడ్రైవర్ షేక్ నజీబ్ మాట్లాడుతూ.. ‘నా కుమారుడి అనారోగ్యంతో బాధపడుతున్నా డు. నీలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నాం. మెడిసిన్ కొనేందుకు కూడా నా వద్ద డబ్బు లేదు. ప్రభుత్వ ఆసుపత్రి అయినప్పటికీ, కనీసం మెడిసిన్ కూడా ఇవ్వ డం లేదు. బీఆర్‌ఎస్ హయాంలోనే డ్రైవర్ల కుటుంబాలు బాగున్నాయి.

ఆటోతోలి సం పాదించుకునేందుకు ఆస్కారం ఉండేది’ అని వాపోయాడు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని వాపోయారు. ఉచిత బస్సు పథకం ఆటోడ్రైవర్ల నోట్లో మట్టికొట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు ఐదుసార్లు బస్ చార్జీలు పెరిగాయని గుర్తుచేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, సినీ నటుడి కంటే గొప్పగా నటించారని, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌లో ఆటో ఎక్కి ఆటోడ్రైవర్లకు అరచేతి లో వైకుంఠం చూపించారని గుర్తుచేశారు. 

ఆ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆటోడ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని మండిపడ్డా రు. ఆటోనగర్, ఆటో సంక్షేమ బోర్డు, ఆటో కార్పొరేషన్ హామీలన్నీ నీటిమూటలయ్యాయని మండిపడ్డారు. ప్రమాద బీమా రూ.10 లక్షల పెంచుతామని ఆ మాట నెరవేర్చుకోలేదని ధ్వజమెత్తారు. హామీల ద్వారా సర్కార్ ఒక్కో ఆటోవాలాలకు రూ.24 వేల చొప్పున బాకీ పడిందని చెప్పుకొచ్చారు. మద్యం టెండర్లకు ప్రభుత్వం 3 లక్షల చొప్పు న ఫీజు  నిర్ణయించి, దరఖాస్తుదారుల నుంచి  రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, ఆ మొత్తం లో రూ.1,500 కోట్లు ఆటోడ్రైవర్ల కోసం వెచ్చించాలని డిమాండ్ చేశారు. ఆటోడ్రైవర్లందరికీ బీఆర్‌ఎస్ అండగా ఉంటుం దని, అసెంబ్లీలో ఆటో డ్రైవర్ పక్షాన గళమెత్తుతుందన్నారు.