calender_icon.png 28 October, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులపైనే నమ్మకం.. బాధిత వర్గాలే బలం!

28-10-2025 01:19:17 AM

-జూబ్లీహిల్స్‌లో పాలక, ప్రధాన ప్రతిపక్షాల మధ్య తీవ్ర పోటీ

-సంక్షేమ పథకాల ప్రచారంపై కాంగ్రెస్ నమ్మకం

-బాధితులకు బాసటగా నిలుస్తున్న బీఆర్‌ఎస్

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాం తి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రె స్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. రెండేళ్లలో అమలు చేసిన పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందిన ప్రజలపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకు న్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలతో నష్టపోయిన బాధితులతోపాటు ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతే తమ పార్టీని గెలిపిస్తాయని బీఆర్‌ఎస్ భావిస్తున్నది. కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న రెండో ఉప ఎన్నిక ఇది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే కంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడంతో అక్కడ తీవ్ర పోటీకి ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన కొద్దీ కాలమే కావ డంతో అధికార పార్టీపై పెద్దగా వ్యతిరేకత రాలే దు. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ సిట్టిం గ్ స్థానమే అయినా ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. అయి తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో మాత్రం దానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ అటు అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఎవరికివారుగా వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. కా ంగ్రెస్ పార్టీ రెండేళ్లలో అమలు చేసిన సంక్షే మ పథకాలపై నమ్మకం పెట్టుకోగా, బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం అధికార కాంగ్రెస్ ధీటుగా బాధి త వర్గాలను గుర్తించి వారికి బాసటగా నిలుస్తుంది. 

లబ్ధిదారులే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా కాం గ్రెస్ ముందు నుంచి వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నది. అభ్యర్థి ఎంపికలోనూ జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని పట్టణ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. బీసీ అభ్యర్థిని పోటీలో నిలిపి బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచించింది. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం కావడం, జీహెచ్‌ఎంసీ పరిధి లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ప్రస్తుతం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రభు త్వ పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని ప్రచారం సాగిస్తోంది.

మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను ప్రతి ఇంటికి చేరేలా ప్రచారం చేస్తున్నది. జూబ్లీహిల్స్ వంటి పట్టణ నియోజకవర్గంలో కూడా పేద వర్గాలు, మహిళలు, వర్కింగ్ క్లాస్ ఓటర్లు కీలక పాత్ర పోషి స్తున్నారు. వీరే పథకాల ప్రధాన లబ్ధిదారులు కావడంతో వారిని లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తున్నది. అయితే జూబ్లీహిల్స్‌లో ము స్లిం ఓటర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థిని పోటీలో నిలపకుండా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు సహకరిస్తున్నారు. ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

బాధితులకు బాసటగా బీఆర్‌ఎస్

బీఆర్‌ఎస్ పార్టీ తమ బాధ్యతను పూర్తిస్థాయిలో సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నది. ప్రజల పక్షాన నిలబడి సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకురావడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందరికీ ఆ పథకాలు చేరడం లేదనే వాదనలు ఉన్నాయి. దీంతో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరని, ఆయా పథకాలకు అర్హులు కాని వారు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు బీఆర్‌ఎస్ పార్టీ బాధిత వర్గాలను అక్కున చేర్చుకుని బాసటగా నిలుస్తున్నది. ప్రతి సమస్యపై పోరాటం చేస్తూ పరి ష్కారం దిశగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది. ముఖ్యంగా రైతుభరోసా, రుణ మాఫీ, ధాన్యం కొనుగోలు, యూరియా కొరత, నిరుద్యోగ సమస్య, ఛార్జీల పెంపు, ఆటో డ్రైవర్ల సమస్య లు, ముఖ్యంగా హైడ్రా కారణంగా ఇళ్లు కోల్పోయిన వారి తరఫున నిలబడుతుంది.

పథకాలు రాని బాధితులు, మధ్య తరగతి, ఐటీ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, యువత బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం బీఆర్‌ఎప్‌కు అవకాశం కల్పిస్తున్నది. బాధిత వర్గాలకు మద్దతు తెల్పడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల నియామకాలు, పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టర్ల చెల్లింపులు, రేషన్ సరఫరా ఆలస్యం, ఇళ్ల మంజూరు జాప్యం వంటి సమస్యలు పెరిగాయని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని బాకీ కార్డు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నది. 

మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేసిందని ప్రజలను చైతన్యం చేస్తున్నది. బీఆర్‌ఎస్ పాలనలో, కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్ పాలనలో నష్టపోయిన వారే తమ బలంగా బీఆర్‌ఎస్ పార్టీ వ్మూహాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నది.