15-11-2025 06:17:37 PM
వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): మండలంలోని నల్లగుంట గ్రామం గంపోనిపల్లిపల్లెలో శనివారం ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. గంపోనిపల్లె గ్రామానికి చెందిన గంప వరలక్ష్మి ఇల్లు అగ్నిప్రమాదానికి గురై దగ్దమైంది. వరలక్ష్మి కూలీ పనికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి గుడిసె పూర్తిగా ధ్వంసమైంది. కూలీ పనులకు వెళ్తున్న రైతులు ఇది గమనించి మంటలను ఆర్పినప్పటికి ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మంటలకు ఇల్లు పూర్తిగా దగ్దమైంది.
నిరుపేద కుటుంబానికి చెందిన వరలక్ష్మి కూలి చేసి జీవనం సాగిస్తుండగా, భర్త లేని పరిస్థితిలో ఇద్దరు చిన్న పిల్లలను ప్రభుత్వ హాస్టల్లో చదివిస్తూ జీవిస్తోంది. ఇంట్లో ఉన్న బీరువా, బట్టలు, కమల గుడిసెలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన గంప వరలక్ష్మికి సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బాధితురాలు, గ్రామస్తులు కోరారు.