07-11-2025 12:05:34 AM
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సందీప్ అగరం, అష్మితరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో టీమ్ గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. “ప్రీ వెడ్డింగ్ షో’ కథ మీద, సినిమా రూపొందిన తీరుపై నమ్మకం, ధైర్యంతో రెండ్రోజుల ముందే ప్రీమియర్లు వేశాం. స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది.
మంచి చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు” అన్నారు. ‘ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన వచ్చింద’ని హీరోయిన్ టీనా శ్రావ్య తెలిపారు. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ప్రీ వెడ్డింగ్ షో’కు ఆడియెన్స్ పెట్టే ఖర్చుకు ఏ మాత్రం నిరాశచెందరు. ఈ మూవీని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అందరితో కలిసి చూస్తే మరింతగా నచ్చుతుంది” అని చెప్పారు. సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, చిత్రబృందం పాల్గొన్నారు.