calender_icon.png 12 December, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాస్‌తో వరించిన అదృష్టం!

12-12-2025 01:50:00 AM

  1. చిన్న ఎలికిచర్లలో మరాఠీ రాజు విజయం 
  2. నరాలు తెగే ఉత్కంఠలో గెలుపు 

షాద్‌నగర్, డిసెంబర్ 11: చిన్న ఎల్కిచర్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య అభ్యర్థిని సర్పంచ్‌గా ప్రకటించారు. ఇద్దరు అభ్యర్థులు పోటీ చేయగా చెరి సమానం ఓట్లు వచ్చాయి. తీరా అధికారులు చేసేది లేక టాస్‌ను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధి లోని కొందూరు మండలం చిన్న ఎలికిచర్ల చిన్న ఎలికిచర్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మరాటి రాజు, అదే పార్టీకి చెందిన మరో అభ్యర్థి మరాటి రాము పోటీ చేశారు.

ఇద్దరికీ 212 చొప్పున ఓట్లు వచ్చాయి. ఓట్లు చెరి సమా నం రావడంతో అధికారులు రికౌంటింగ్ జరిపారు. అయినా కూడా సమానంగానే వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేశారు. టాస్ ఎవరిని వరిస్తుందోనని ఇద్దరు అభ్యర్థులతో పాటు మొత్తం గ్రామం వేచి చూ సింది.

చివరకు టాస్ మరాఠీ రా జును వరించడం తో సర్పం చ్ అభ్యర్థిగా ప్రకటించారు. చిన్న ఎల్కిచర్ల గ్రామ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ యువ నాయకుడు అక్రమ్ తదితరులకు మరాఠీ రా జు పాదానికి వం దనం చేశారు. అ దేవిధంగా ఎనిమిదో వార్డులో 32 ఓట్లతో గెలుపొందిన చక్కని మహేష్ యాదవ్ డిప్యూటీ సర్పం చ్‌గా ఎన్నికయ్యారు.

2 ఓట్లతో గెలుపు

షాద్‌నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం చేరిగూడ గ్రామంలో కాంగ్రెస్ పా ర్టీ బలపరిచిన అభ్యర్థి శారద రెండు ఓట్లతో గెలుపొందారు. 2 ఓట్ల తేడాతో విజయమ్మ ఓడిపోవడంతో రికౌంటింగ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అధికారులు రి కౌంటింగ్‌కు ఒప్పుకోవడం లేదని మాజీ స ర్పంచ్ ప్రశాంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.