12-12-2025 01:51:31 AM
ఆదిలాబాద్(విజయక్రాంతి): ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన రామేశ్వర్, నర్వట్ ఈశ్వర్ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా చెరో 176 ఓట్లు వచ్చాయి. దీంతో గ్రామం లో ఉత్కంఠ నెలకొంది. చివరకు అధికారులు లక్కీ డ్రా ద్వారా సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే టాస్ వేసి లక్కీ డ్రా నిర్వహించగా అందులో గెలిచిన ఈశ్వర్ ను సర్పంచ్‌గా ప్రకటించారు. దీంతో లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం జిల్లాలో విచిత్రమైన ఘటనగా నిలిచింది.