calender_icon.png 9 May, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిర్చిరైతులకు కేంద్రం శుభవార్త

09-05-2025 02:09:06 AM

-ఎంఐఎస్ పథకం ద్వారా క్వింటా మిర్చికి రూ.10,374 కనీసధర

-కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాసిన లేఖకు కేంద్ర వ్యవసాయ శాఖ స్పందన 

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): తెలంగాణలోని మిర్చి రైతులకు కేంద్ర ప్రభు త్వం శుభవార్త చెప్పింది. మిర్చి ధరలు తగ్గినప్పుడు తెలంగాణ రైతులకు నష్టం జరగ కుండా మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం(ఎంఐఎస్) ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధి చేయ నుంది.

మిర్చి పంట పండించేందుకు అయ్యే ఖర్చుకన్నా తక్కువ మొత్తానికి మార్కెట్‌లో విక్రయించాల్సి వచ్చినప్పుడు.. కనీసం ఖర్చు ను అందిస్తూ మిర్చిరైతులకు ఎలాంటి నష్టం ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కేం ద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఎంఐఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పథకాన్ని తెలంగాణలో అమలుచేయడానికి సుముఖంగా ఉన్నామని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ కు కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరం ఎంఐఎస్ పథకం కింద తెలంగాణలో ఉత్పత్తి అయిన మిర్చిపంటలో 1,72,135 మెట్రిక్ టన్నుల పంటకు గాను, 25శాతం అంటే (6,88,540 మెట్రిక్ టన్నులు) పంటకే వర్తింపజేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. మిర్చిపంటకు ఎంఐఎస్ పథ కం కింద క్వింటాల్ కు రూ. 10,374లుగా నిర్ధారించింది.

ఎంఐఎస్‌కు, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలుత రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 శాతం భరించాల్సి ఉంటుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని వ్యవసాయ శాఖ వివరించింది.

కాగా, తెలంగాణలో మిర్చి రైతులకు ఎలాం టి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గతనెల 4వ తేదీన లేఖ రాశారు.

ఖమ్మం, మహబూబాబాద్, జోగులాంబగద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌భూపాలపల్లి, ము లుగు, సూర్యాపేట, వరంగల్ తదితర జిల్లాలో రైతులకు ఎక్కువగా మిర్చి పండిస్తారని, వారికి మార్కెట్‌లో సాగుధర కన్నా తక్కువ ధర వస్తుండటంతో ఆర్థికంగా నష్టపోతున్నవారిని ఆదుకోవాలని కిషన్‌రెడ్డి రాసిన లేఖకు కేంద్రం స్పందించింది.