20-10-2025 12:00:00 AM
పదర, అక్టోబర్ 19 : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోనూ మద్యం ఏరులై పారుతున్నది ఏ వీధికి వెళ్ళినా బెల్ట్ షాపులే దర్శ నమిస్తున్నాయి. మండలంలోని లైసెన్స్ ఉ న్న మద్యం దుకాణం ఒక్కటే అది మండల కేంద్రంలోని ఏర్పాటు చేశారు. ఈ షాపుకు అనుసంధానంగా మండలంలో ఎలాంటి అ నుమతులు లేకుండా 50కి పైగా కిరాణా దు కాణాలు, బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. ఒక్కో వాటర్ బాటిల్ పై రూ,20 నుంచి రూ 30 వరకు అధిక వసూలు చేస్తూ సొమ్ము చే సుకుంటున్నారు.
తెల్లవారుజామున 4 నుం చి మద్యం విక్రయాలు ఊపందుకుంటాయి. ఒక్కో బాటిల్ లూస్ మందు కల్తీ చేస్తూ అ ధిక ధరకు విక్రయిస్తూ కాసులు పోగేస్తున్నారు. ప్రధానంగా గ్రామాలలో కిరాణా షా పులు, హోటల్లు, అనధికారిక దుకాణంలో ఎ లాంటి బెరుకు భయం లేకుండా విక్రయిస్తున్నారు. దీంతో వాహనదారులు, కూలి పను లు చేసుకుంటున్న వారు కూడా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు, కుటుంబాలలో గొడవలు చెలరేగుతున్నాయి.
పలు మార్లు ఆయా గ్రా మాల్లోని ప్రజలు పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించినా, తూతు మంత్రంగా తనిఖీలు చేసి చేతులు త డిపేసుకుని దులుపుకోవడంతో యధావిధి గా బెల్టు షాపులు కొనసాగుతున్నాయని ఆ రోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సాధిం చి బెల్ట్ షాపులను నిలువరించాలని మండ ల ప్రజలు కోరుతున్నారు.
నిద్రావస్తలో ఎక్సైజ్ శాఖ..
గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగి ప్రమాదాలు, గొడవలు ఇతర అనర్ధాలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నా రని సామాన్య మహిళలు మండిపడుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయం లో మాత్రమే అడపదడప గాడులు చేసి తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించాలని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు...
గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై దాడులు చేసి చర్యలు తీసు కుంటాం. అలాగే గ్రామీణ ప్రాంతాలలో కిరాణా దుకాణాలు, ఇండ్ల వద్ద ఎవరైనా మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు మాకు స మాచారం ఇస్తే మద్యం సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తాం.
సతీష్, ఎస్సై ఎక్సైజ్‌శాఖ, పదర