calender_icon.png 5 July, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో గోపాల సునిత

02-07-2025 10:38:07 PM

ఆలయ బోర్డు సభ్యురాలు గోడాస్ ఉమారాణి ప్రత్యేక ఆహ్వానం

సనత్ నగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన స్థానం ఉన్న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లి(Balkampet Yellamma Temple) కళ్యాణ మహోత్సవంలో గండిపేట ఎంపీటీసీ సభ్యురాలు గోపాల సునిత(MPTC Member Gopala Sunitha)  భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పవిత్ర రథోత్సవ కార్యక్రమంలో ఆమె హాజరై అమ్మవారి దివ్య దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి బల్కంపేట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు గోడాస్ ఉమారాణి గోపాల సునితని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని, భక్తుల సేవకోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గోపాల సునిత మాట్లాడుతూ... “ఎల్లమ్మ తల్లి కళ్యాణం సమయంలో ఆలయంను దర్శించడం నాకు చాలా ధన్యతను కలిగించింది. రథోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించిన దేవాదాయ శాఖను, భద్రతా ఏర్పాట్లకు సహకరించిన పోలీసు అధికారులను అభినందిస్తున్నాను,” అని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని వారు ఆకాంక్షించారు.