24 March, 2026 | 7:44 AM

ఐసీఏఐ కో ఆప్టెడ్ మెంబర్‌గా గోపీచంద్

24-03-2026 12:02 AM

వరంగల్, మార్చి 23 (విజయక్రాంతి): న్యూ ఢిల్లీ , నాన్ స్టాండింగ్ (మెంబెర్స్ ఇన్ ప్రాక్టీస్ ) కమిటీ, 2026,27 సంవత్సరానికి, కోఆప్టెడ్ సభ్యుడుగా వరంగల్ కు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ త్రిపురనేని గోపీచంద్ నియమితులయ్యారు. తన  నియామకాన్ని సంస్థ ప్రస్తుత చైర్మన్ ఆదివారం రాత్రి మెయిల్ ద్వారా న్యూ ఢిల్లీ హెడ్ ఆఫీస్ నుండి తెలియ  పరిచినట్లు సీ ఏ గోపీచంద్ తెలిపారు. 

తన నియామకానికి సహకరించడం ఐ సి ఏ ఐ ప్రెసిడెంట్, సీఏ ప్రసన్న కుమార్, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులైన ముప్పాల శ్రీధర్, దయా నివాస్ శర్మ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వరంగల్ సీఏలకు, సహకరించిన దక్షిణ భారత ప్రాంతీయ సభ్యులందరికి అయన కృతజ్ఞతలు తెలియ జేశారు.