విద్యార్థులు మంచి స్నేహితులను ఎంచుకోవాలి
16-06-2026 02:06 AM
ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ క్రైo, జూన్ 15 : విద్యార్థులు మంచి స్నేహితులను ఎంచుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని పానగల్ లో ప్రభుత్వ పాఠశాల ప్రారంభం రోజున విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ఉపా ధ్యాయులు చెప్పిన మాటలు వినాలని వారి మార్గదర్శకంలో నడిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
సామాజిక మాధ్యమాలకు, ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలని,లింకులు ఓపెన్ చేయద్దని,గంజాయి, మత్తు కు దూరంగా ఉండాలని, రోడ్డు దాటే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిదండ్రులు వాహనాలు నడిపితే హెల్మెట్ ధరించాలని చెప్పాలని కోరారు. కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి, సిఐ రాఘవరావు, ఎస్‌ఐ మానస ఉన్నారు.






