22-09-2025 12:43:35 AM
ఘట్ కేసర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : లంబాడి సమాజాన్ని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కొంతమంది నేతలు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిష్ప తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఘట్ కేసర్ గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించారు.
బైక్ ర్యాలీ ఎన్ ఎఫ్ సి నగర్ శీతల భవాని దేవాలయం నుండి ఘట్ కేసర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘట్ కేసర్ మున్సిపాలిటీ కమిటీ అధ్యక్షులు మాలోత్ మోతిలాల్ నాయక్, ఉపాధ్యక్షులు రూపావత్ నరేష్, ప్రధాన కార్యదర్శి గుగులోత్ కిరణ్ నాయక్, కోశాధికారి డాక్టర్ రమావత్ పురుషోత్తం నాయక్, గౌరవ అధ్యక్షులు రవినాథ్ నాయక్,
శంకర్ జీ నాయక్, హనుమంత్ నాయక్, ఉమ్లా నాయక్, బాలాజీ నాయక్, ఐలు నాయక్, కల్చరల్ సెక్రటరీ వాలు నాయక్, సోషల్ మీడియా ఇంచార్జి బి. సంతోష్ నాయక్, సంతోష్, సతీష్, వెంకన్న, సురేష్, వినోద్, చిట్టీ బాబు, తిరుపతి, కిరణ్, శ్రీ కృష్ణ, మహేష్, మధు, భాస్కర్, కల్చరల్ సెక్రటరీ వాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.