13-08-2025 12:23:22 AM
క్రీడలకు సంబందించి నిర్మాణానికి స్థల పరిశీలన
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి
వనపర్తి, ఆగస్టు 12 ( విజయక్రాంతి ) : విద్యాపర్తిగా పేరెన్నిక గన్న వనపర్తి జిల్లా రానున్న కా లంలో క్రీడలకు పుట్టినిల్లుగా మారబోతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి , రా ష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాల పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో క్రీడల అభివృద్ధి పరంగా నూతనం గా చేపట్టబోయే పలు నిర్మాణాలకు వారు స్థలాల పరిశీలన చేశారు. వనపర్తి మెడికల్ కళాశాల పక్కనగల ఎనిమిదిన్నర ఎకరాలలో క్రీడా మైదానం నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు.
వనపర్తి బాలుర జూనియర్ కళాశాల మైదానంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి శిల పరిశీలన చేశారు. వనపర్తి జిల్లా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల డిగ్రీ కళాశాల పక్కనగల మైదానంలో హాకీ టర్ఫ్ మైదానం ఏర్పాటుకు స్థల పరిశీలనం చేశారు. అనంతరం శ్రీనివాసపురం శివారులో 35 ఎకరాల్లో క్రీడా పాఠశాల ఏర్పాటు కు వారు స్థల పరిశీలన చేశారు. వీటి నిర్మాణాలకు త్వరలోనే పరిపాలన అనుమతులు జారీ అవుతాయని వీటికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను వెంటనే సమర్పించాలని వారు అధికారులకు సూచించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విద్యా రంగంలో పేరుగాంచిన వనపర్తి జిల్లా కేంద్రాన్ని రానున్న కాలంలో క్రీడారంగంలోనూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా అన్ని వసతులను ఏర్పాటు చే స్తామని ఇక్కడి నుంచే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే విధంగా త ర్ఫీదు నుంచి క్రీడాకారులను తయారు చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్లు, మం డల నాయకులు, క్రీడా శాఖ అధికారులు, ఆర్డిఓ, తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.