13-08-2025 12:23:24 AM
హనుమకొండ టౌన్, ఆగస్టు 12: ప్రము ఖ రచయిత్రి, ప్రజా రచయిత్రుల సంఘం ఆల్ ఇండియా అధ్యక్షురాలు అనిశెట్టి రజిత సోమవారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేశారు. కాగా అనిశెట్టి రజిత వరంగల్ ప్రజాస్వామ్యకరచరిత్ర వేదిక అధ్యక్షురాలిగా సాహితీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు.
ఆమె మరణం పట్ల వరంగల్ ఎంపీ కడియం కావ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రచయిత్రిగానే కాకుండా సాంస్కృతిక ఉద్య మాల పట్ల అంకితభావం, సామాజిక సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తెలుగు సాహితి లోకానికి సేవలందించిన రజిత మరణం సాహిత్య రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మంగళవారం రజి త భౌతికదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆమె క్రియాశీలకంగా పని చేశారని అన్నారు. స్త్రీ సామాజిక సమానత్వం కోసం ప్రజల్లో, మహిళల్లో చైతన్య నింపారని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు బంధు మిత్రులకు సానుభూతిని వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా నాయకుడు ఎం చుక్కయ్య, ప్రజాసంఘాల నాయకురాలు రమాదేవి, మాజీ ప్రిన్సిపల్ బన్న ఐలయ్య, కేయూ ప్రొ ఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
స్త్రీ స్వేచ్ఛ కోసం రచనలు
అనిశెట్టి రజిత స్త్రీ స్వేచ్ఛ, పీఢన నుంచి విముక్తి కోసం అనేక రచనలు చేసి గుర్తింపు పొందారు. 1958లో జన్మించిన రజిత బా ల్యం నుంచే ప్రముఖ రచయితల ప్రసంగాలకు ఆకర్షితురాలై రచనలు చేయడం ప్రా రంభించారు. 1973లో ‘చైతన్యం పడగెత్తిం ది’ అనే సాహితీరంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత సుమారు 500 పైగా కవితలు, 109 వ్యాసాలు, 38 పాటలు రచించారు. 20కి పైగా పురస్కారాలు అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌గా పని చేశారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన రచనల ద్వారా చైతన్యానికి ఊపిరి పోశా రు. తెలంగాణ ప్రభుత్వం 2017లో రజితకు విశిష్ట మహిళ పురస్కారం ప్రదానం చేసింది. మరణానికి ముందే ఆమె తన దేహాన్ని వైద్య విద్యార్థులకు అధ్యయనం కోసం దానం చేయడానికి అంగీకరిస్తూ పత్రాన్ని ఇచ్చారు. ఆ మేరకు రజిత భౌతికకాయాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేశారు. అవివాహితురాలైన రజిత హనుమకొండలోని తన స్నేహితురాలి ఇంట్లో ఉంటున్నారు.
రజిత మరణంపట్ల కేసీఆర్ సంతాపం
అనిశెట్టి రజిత మరణం పట్ల మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటిస్తూ మంగళవారం లేఖను విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని, పీడిత వర్గాల పట్ల సామాజిక బా ధ్యతతో కూడిన సాహిత్యాన్ని అందించిన వరంగల్ బిడ్డ అనిశెట్టి రజిత మరణం తెలంగాణకు తీరని లోటు అన్నారు. తెలంగాణ గొప్ప ప్రజాస్వామిక సాహితీవేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆమె అకా ల మరణంతో శోకతప్తులైన బంధుమిత్రులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.