calender_icon.png 13 August, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘డబుల్’గృహలకు మౌలిక వసతులు కల్పించాలి

13-08-2025 12:23:17 AM

  1. లేని పక్షంలో ఆర్డీవో ఆఫీసు ఎదుట ధర్నా చేస్తా..

మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

నిర్మల్, ఆగస్టు ౧౨ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా కేంద్రంలోని సిద్దాపూర్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయంలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారుల కేటాయించాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.

మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్‌కు ఎంపికైన లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రభు త్వం అధికారులు ఈనెల 25 లోపల మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇల్లు లు కేటాయింపు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

తన హయాంలో పేదలకు ఇల్లు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఈనెల 25వ తేదీ నుంచి అధికార పా ర్టీ నేత అయినప్పటికీ ప్రజల కోసం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకు లు ధర్మాజీ రవీందర్ రామలింగం ముడుసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.