25-11-2025 12:12:07 AM
ఆమనగల్లు, నవంబర్ 24 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, వారిని ఆర్థికంగా అన్ని రంగాల్లో పురోగమించేందుకు ప్రత్యేక పథకాల కు శ్రీకారం చుట్టినట్లు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లు తెలిపారు. సోమవారం కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల్ మండలాలలో ఎంపీ, ఎమ్మెల్యేలు పర్యటించారు. ఆయా మండల కేంద్రాల్లో ఇందిరమ్మ చీరలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ని స్ఫూర్తి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు వృధిలోకి వస్తాయని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలని వారు కోరారు. రాష్ట్రంలో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని వారు గుర్తు చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నిక లు రానున్నాయిని తమ ప్రాంతాలను అభివృద్ధి చేసే వారికి ప్రజలు మద్దతు తెలపాలని వారు కోరారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతిని తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి పెద్దపీట
యాచారం, నవంబర్ 24 : మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళ లకు ఇందిరమ్మచీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని గతంలో కన్నా నాణ్యమైన చీరలను కాంగ్రేస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తుందని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలు స్తున్నాయని చెప్పారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండోరోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తున్నామని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, డైరెక్టర్ మస్కు నరసింహ,ఎంపీడీవో రాధారాణి,డిపిఎం లీలా కుమారి,ఎపిఎం రవీందర్, సిసిలు గణేష్, రాజు, మండల సమైక్య కార్యదర్శి మస్కు లక్ష్మమ్మ , కాంగ్రెస్ నాయకులు రాచర్ల వెంకటేశ్వర్లు, బిలకంటి శేఖర్ రెడ్డి, అరవింద్ నాయక్, వివో, మహిళా సంఘాల సభ్యులు తుదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
అబ్దుల్లాపూర్ మెట్ , నవంబర్ 24: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళ లకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో శివ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మహిళకు చీరాల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్షమన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. విడతల వారీగా నిధులు మంజూరు చేస్తూ ప్రతి పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర చారి, సింగిల్ విండో డైరెక్టర్లు, వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
మొయినాబాద్, నవంబర్ 24 (విజయ క్రాంతి): తెలంగాణలోని ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీంభరత్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భూమి పూజలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గోని భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నియామక పత్రాలను అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిరుపేదలకు గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లను దశలవారిగా కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామిని అమలు చేస్తూ.. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో అధిక స్థానాలు గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలోపార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మహిళాకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య
మొయినాబాద్: మొయినాబాద్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం.. స్వయం సహాయక సంఘాల మహిళలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డిలు కలిసి సోమవారం ఎంపీడీవో కార్యాలయం లో మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. మహిళలను ఉన్నత స్థాయి లో ఉంచడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది గృహిణులకు ఆనందం కలిగిస్తుందని ప్రతి మహిళకు గౌరవం సం తోషం చేరేలా ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టడం శుభపరిణామని ఆయన పేర్కొ న్నారు.
నియోజకవర్గంలోని డ్వాక్రా మహి ళలందరికీ చీరలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలి పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, టీపీ సీసీ కార్యవర్గ సభ్యులు షాబాద్ దర్శన్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, ఫిషర్మెన్ మహేందర్ ముదిరాజ్, పల్లగోల్ల అశోక్ యాదవ్, పట్నం రాంరెడ్డి, నేరేట్ల రాజు గౌడ్, గడ్డం వెంకట్ రెడ్డి, జంగయ్య, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి చారి, మండల అభివృద్ధి అధికారి సంధ్య, మహిళలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.