calender_icon.png 25 November, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పోచమ్మ, ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలు

25-11-2025 12:07:32 AM

మేడ్చల్ అర్బన్, నవంబర్ 24 (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని అత్వెల్లి మున్సిపల్ పట్టణంలో గల వెంకయ్య కాలనీలో ఘనంగా పోచమ్మ,ముత్యాలమ్మల బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అత్వెల్లి వెంకయ్య కాలనీలో గల పోచమ్మ,ముత్యాలమ్మల ఆలయం పురాతనం కావడంతో కాలనీకి చెందిన మండల వంశీయులు ఆలయాన్ని పూలతో నిర్మాణం చేసి మూడు రోజుల పాటు దగ్గర ఉండి ప్రతిష్ట ఉత్సవాలు నిర్వహించినట్లు చెప్పారు.కాలనీ వాసులంతా బోనాల పండుగలు ఘనంగా నిర్వహించి కాలనీలోని అమ్మ వార్లకు బోనాలను సమర్పించినట్లు వారు వెల్లడించారు.బోనాల పండుగ ఉత్సవాల కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.