25-11-2025 12:09:39 AM
-సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి ఆమోదయోగమైన పరిహారం అందజేస్తాం
-రైతులకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి భరోసా
కడ్తాల్, నవంబర్ 24( విజయక్రాంతి): గ్రీన్ ఫీల్ రోడ్డు కోసం భూములు స్వచ్ఛందంగా ఇచ్చే రైతులకు ప్రభుత్వం అండగా ఉండి రైతులకు ఆమోదయోగ్యమైన భూ పరిహారం అందజేస్తామని, రైతుల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించి న్యాయం చేస్తామని నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి కల్వకుర్తి ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు భరోసా కల్పించారు. సోమవారం కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామంలో గ్రీన్ ఫీల్ రోడ్డు కోసం ప్రభుత్వం గుర్తించిన ప్రతిపాదిత భూములను ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులతో పరిశీలించారు.
అనంతరం రైతులతో ఎంపీ, ఎమ్మెల్యే ముఖాముఖీ సమావేశం నిర్వహించి రైతుల సందేహాలు నివృత్తి చేశారు, ఈ సందర్బంగా ఎంపీ డా. మల్లు రవి మాట్లాడుతూ నాకు ఈ ప్రాంతంతో 30 సంవత్సరాల అనుబంధం ఉందని ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ కూర్చోలేము అని, త్వరలోనే సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిహార విషయం పై చర్చించి అందరికి ఆమోదయోగ్యమైన నష్టపరిహారం అందిస్తామని హామీ నిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి సహకరిస్తున్న రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని.. భూమి విలువ, రైతుల కష్ట రైతుల కష్ట, నష్టాలు తనకు తెలుసన్నారు. చిన్న,సన్నకారు రైతుల కు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా కల్పించారు. సమావేశా అనంతరం మహిళ సంఘాలకు సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసారు. గ్రామం లో గతంలో హామీ ఇచ్చిన మేరకు ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించాలని ముదిరాజ్ నాయకులను కోరారు.
గ్రామంలో సెల్ ఫోన్ సిగ్నల్ సమస్య పై ఎంపీ మల్లు రవి బీఎస్‌ఎన్ ఎల్ జనరల్ మేనేజర్ తో మాట్లాడారు. తండా వాసుల నివాస స్థల లను గ్రామకంఠంలో కలపడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, ఎమ్మార్వో జయశ్రీ, ఎంపీడీవో సుజాత, తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకులు పాలకుర్ల రవి కాంత్ గౌడ్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జోగు వీరయ్య, రచ్చ శ్రీరాములు, పాలకుర్ల రాములు, లక్ష్మయ్య, కరుణాకర్ గౌడ్, జంగయ్య గౌడ్, రమేష్ నాయక్, వెంకటేష్, చోటే, అజిజ్, హరీష్, శ్రీను, యాదయ్య, శంకరయ్య, పాండు, సుమన్, బాలరాజు ముత్యాలు, నారాయణ, జంగయ్య రైతులు పాల్గొన్నారు.