25-11-2025 12:11:20 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): నగరంలోని శాలిబండలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ షోరూం ఉన్న రెండతస్తుల భవ నం మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు వచ్చి 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్ర యత్నం చేశారు.
భారీగా మంటలు ఎగిసిపడటంతో చుట్టు ఉన్న ఇతర దుకాణాలకు అంటకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అయితే ప్రమాద సమయంలో గోమతి షోరూం సి బ్బంది అందులోనే ఉండటంతో తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. చికిత్స నిమిత్తం వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. షోరూంలో మంటలు ఎగిసిపడుతుండటం తో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.