04-07-2025 01:02:59 AM
మేడ్చల్ అర్బన్, జూలై 3: మేడ్చల్ మండల తహసీల్దారుగా వి. భూపాల్ గురువారం తన కార్యాలయ ఆవరణలోని గడి మైసమ్మ తల్లిని దర్శించుకుని భాద్యతలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండల తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న ఆయనను మేడ్చల్ మండల తహసీల్దారుగా బదిలీ అయ్యారు.
ఇదిలా ఉంటే మేడ్చల్ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వి.భూపాల్ గతంలో బాచుపల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్ తహసీల్దార్ గా పని చేశారు. ఇక్కడ పని చేసిన తహసిల్దార్ శైలజ 4 నెలల క్రితం నాగర్ కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యారు. అప్పటినుంచి డిప్యూటీ తహసీల్దార్ ఇన్చార్జిగా ఉన్నారు. అప్పట్లో విజయ క్రాంతి పత్రికలో వచ్చిన కథనాల పై విచారణ జరిపి తహసిల్దార్ శైలజ పై క్రమశిక్షణ చర్యలుతీసుకున్నారు.