calender_icon.png 24 November, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్య సాయి చూపిన మార్గంలో నడుద్దాం

24-11-2025 01:38:01 AM

బాబా శత జయంతి ఉత్సవాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే వెల్లడి

ఆదిలాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి) : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరిస్తేనే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంటుం దని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కైలాస నగర్లో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది జన్మదినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం భక్తులు భజనలు, సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ... అన్ని కులా లు, మతాలకు అతీతంగా ప్రేమ, సేవ, మానవత్వం బాబా సందేశం ఇచ్చారన్నారు. ఆయ న సేవా ధ్యేయాన్ని ప్రభుత్వం గుర్తించి అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించేం దుకు ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నా రు. అదేవిధంగా సత్యసాయి ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయ మన్నారు.

జిల్లా యువతకు ప్రయోజ నకరం గా ఉండే సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు భూమి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తరఫున తాను కృషి చేస్తాన ని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందిని మానవత్వ మార్గంలో నడిపించాయన్నారు. ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవలు సమాజ మా ర్పుకు దోహదపడుతున్నాయని తెలిపారు. ఈ శతాబ్ది వేడుకల్లో జడ్పి మాజీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, డివైఎస్‌ఓ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మనోహర్, మున్సిపల్ కమిషనర్ రాజు, భక్తులు పాల్గొన్నారు.