calender_icon.png 20 November, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి ఆడబిడ్డలకు వరం ప్రభుత్వ పథకాలు

20-11-2025 12:00:00 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్ నవంబర్ 19(విజయ క్రాంతి): తెలంగాణలోని పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి , షాది ముబారక్  పథకం ఒక వరమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు బుధవారం కట్టంగూరు మండలంలోని స తహశీల్దార్ కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కులను (57) ముఖ్య మంత్రి సహాయ నిధి (CMRF) 29 చెక్కులను ల ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలను ఆర్దికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

మహిళలకు ఉచిత బస్సు, వడ్డీ లేని రుణాలు అందిసున్నామని ఆయన పేర్కొన్నారు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఉపయోగ పడే విధంగా ఆరోగ్యశ్రీ  పరిమితి 10 లక్షల వరకు పెంచామని తెలిపారు. త్వరలో నకిరేకల్ లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభిస్తామని అన్నారు.

200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. నేడు  పేదలకు సన్నబియ్యం ఇస్తున్నం...   ఇందిరమ్మ ఇండ్లను కూడా దశల వారీగా కేటాయిస్తామని  తెలిపారు.ఈకార్యక్రమంలో కట్టంగూర్ తహశీల్దార్ పుష్పలత, మాజీ జెడ్పిటిసిలు మాద యాదగిరి, సుంకరబోయిన నరసింహ, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ద చుక్కయ్య, నాయకులు నంద్యాల వెంకట్ రెడ్డి, దార బిక్షం, గడుసు శంకర్ రెడ్డి, ఎస్త్స్ర మునుగోటి రవీందర్, అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మెటల్ రోడ్డుకు శంకుస్థాపన 

కట్టంగూర్ మండలంలోని ఈదులూరు నుండి కురుమర్తి గ్రామం (2.5 కి. మీ) వరకు రూ. 50.00 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మెటల్ రోడ్డు నిర్మాణ పనులకు  బుధవారం నకిరేకల్  ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పెరమళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు, నాయకులు మాద యాదగిరి, సుంకరబోయిన నరసింహ, పెద్ది సుక్కయ్య,  ఈదులూరు మాజీ సర్పంచ్ ఐతగోని నారాయణ,  బి శ్రీను, మిట్టపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.

 ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు 

భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ  జయంతి వేడుకలును నకిరేకల్ పట్టణంలోని సెంటర్లో ఆమె విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాలువేసి   ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్,  నాయకులు పన్నాల రాఘవరెడ్డి, నకిరేకంటి ఏసు పాదం ,లింగాల వెంకన్న, యాసారపు వెంకన్న , రాచకొండ సునీల్ ,కొండ వెంకన్న గౌడ్, గాజుల సుకన్య,  గోలి పద్మ,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.