19-11-2025 10:44:00 PM
ఎల్బీనగర్: శ్రీశైల జగద్గురువు దివ్య ఆశీస్సులతో కార్తీక మాసం మాసశివరాత్రిని పురస్కరించుకొని నాగోల్ మమతా నగర్ లో కొలువైన శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో దవేరుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణ ఉత్సవాలకు శ్రీశైల మల్లికార్జున సమజోత్థాన ఫౌండేషన్, ట్రస్ట్, ఆలయ నిర్వహణ సేవాదళ్ కమిటీ ఆధ్వర్యంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కల్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా భక్తులు పాల్గొని కల్యాణాన్ని వీక్షించారు. అంతరం అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.