01-07-2025 01:45:42 AM
రాజన్న సిరిసిల్ల, జూన్ 30 (విజయక్రాంతి ) ః ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.జగిత్యాల జిల్లాకు చెందిన బోదాసు మహేష్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లాకి చెందిన గద్దల స్వప్న,విశాల్ సింగ్ జగిత్యాల జిల్లాకు చెందిన నేరెళ్ల శ్రీనివాస్,నేరెళ్ల రాణి గోత్రాల బాలమణి అను ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో తాళం వేసిన ఇండ్లు లక్ష్యంగా ఆర్ముర్,నిజామాబాద్,వేములవాడ, కొనరావుపేట, బోయినపల్లి ప్రాంతల్లో దొంగతనం చేయడానికి సరైన సమయం కోసం చూస్తుండగా తేదీ 02-05-2025 రోజున రాత్రి సమయంలో వేములవాడ పట్టణం సాయి నగర్ ప్రాతంలో దొంగతనానికి పాల్పడగా, 23-05-2025 రోజున మరల సాయి నగర్ ప్రాతంలో,12-06-2025 రోజున వేములవాడ పట్టణం భగవంతరావు నగర్ ప్రాంతంలో,తేది.11.05.2025 రోజున రాత్రి సమయంలో ఆర్మూర్ పట్టణంలోని అరుంధతినగర్ ప్రాంతం,తేది.16.05.2025 రోజున రాత్రి సమయoలో ఆర్మూర్ పక్కన గల పెరకిట్ వినాయకనగర్ ప్రాంతంలో , అదేవిదంగా తేది.25.05.2025 రోజున అర్ద రాత్రి సమయoలో ఆర్మూర్ పక్కన గల పెరకిట్ వినాయకనగర్ ఏరియాలో ప్రాంతంలో ఇక ఇంట్లో, తేది.02.06.2025 రోజున వేకువ జామున ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ షాప్లో,అదేవిదంగా తేది. 07.06.2025 రోజున వేకువ జామున ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో,ఆదేవిదంగా తేది.16.06.2025 రోజున వేకువ జామున ఆర్మూర్ పక్కన గల పెరకిట్ ఆర్టీసీ కాలనీలో భోదాసు మహేష్ అనే నిందుతుని ఆధ్వర్యంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.
వరుస దొంగతనాలు చెక్ పెట్టి నింధితులను ప ట్టుకోవడంలో కృషి చేసిన వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ లు అనిల్ కుమార్, వెంకట్రాజం, సిబ్బంది గోపాల్, పంతులు, లత, సాహెబ్ హుస్సేన్, దేవేందర్, సంయుద్దీన్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.