calender_icon.png 7 July, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీల కేటాయింపు

07-07-2025 12:00:00 AM

కర్ణాటకలోని పుణ్యక్షేత్ర దర్శనాలు బాన్సువాడ డిపో నుంచి కర్ణాటక రాష్ట్రం

బాన్సువాడ జులై 6 (విజయ క్రాంతి): బాన్సువాడ ఆర్టీసీ నుంచి వారం రోజులకు ఒక తీర్థయాత్ర టూర్ ప్యాకేజీ బస్సును ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారికి ఈ టూర్ ప్యాకేజీలు ఉపయోగపడుతున్నాయి.కర్ణాటకలోని పుణ్యక్షేత్ర దర్శనాలు బాన్సువాడ డిపో నుంచి కర్ణాటక రాష్ట్రం జర్హాసంగం మహాదేవుని దర్శనం,

బీదర్ నర్సింహస్వామి ఆలయం గానుగాపూర్ దత్తాత్రేయుని ఆలయం  ప్రత్యేక డీలక్స్ బస్సును ఈనెల 10న బాన్సువా డిపో నుంచి నడపనున్నట్లు డీఎం సరితాదేవి తెలిపారు. బాన్సువాడ నుంచి ఉదయం ఆరు గంటలకు బస్సు బయలుదేరుతుందని, రాత్రి 12 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందని తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ.1,300, పిల్లలకు రూ.650 ఉందని, టికెట్స్ కోసం గోపికృష్ణ 9063408477ను సంప్రదించాలని ఆమె కోరారు.