23-12-2025 01:08:35 AM
నకిరేకల్, డిసెంబర్ 22(విజయ క్రాంతి): నకిరేకల్ పట్టణంలోని ఉద్దీపన వివియం పాఠశాలలో గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినం పురస్కరించుకొని సోమవారం జాతీయ గణిత శాస్త్రదినోత్సవాన్నిపాఠశాలలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలవేసినివాళులర్పించారు.మ్యాథ్స్ డే సందర్భంగా శ్రీనివాస రామానుజన్ సంఖ్య 1729 ఆకారంలో విద్యార్థులు కూర్చొనిప్రదర్శించడంతోపాటు ప్రాక్టికల్ మ్యాథమెటిక్స్ మోడల్స్ మేళానువిద్యార్థులు ప్రదర్శించారు.
ఈసందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ గంగాధర భద్రయ్య మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్22నతమిళనాడులో జన్మించి గణిత శాస్త్రంలో ఎనలేని కృషి చేసి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు. గణిత శాస్త్రంలో అనేక కొత్త ఫార్ములాలను కనుగొన్నాడని ఆయన తెలిపారు. శ్రీనివాస రామానుజన్ సంఖ్యా సిద్ధాంతం అనంత శ్రేణులు విభజన సూత్రాలు వంటి వాటిలో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచ గణిత శాస్త్రవేత్తల మెప్పు పొందాడని గణిత శాస్త్రంలో జ్ఞాన సంపదను దేశానికి అందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్దీపన ఫౌండేషన్ కోఆర్డినేటర్ చెరుకు సతీష్ ప్రైమరీ హెడ్మాస్టర్ రామయ్య ఉపాధ్యాయులు శ్రీలత జీవన్ శిరీష శ్రీలత నాగమణి నాగజ్యోతి మాధురి హమీద వెన్నెల యాదగిరి సమత తదితరులు పాల్గొన్నారు.