calender_icon.png 23 December, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ ఉచ్చులో పడొద్దు

23-12-2025 12:00:00 AM

ఉప్పల్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి  మోసపోవద్దని   నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబలి అన్నారు.   నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని  హోలీ ఫెయిత్  స్కూల్  సైబర్ అవగాహన సదస్సును  సోమవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మైబలి మాట్లాడుతూ.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటూ  కొందరు కేటుగాళ్లు వివిధ మాయమాటలతో బురిడీ కొట్టించి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని, విద్యార్థులు నేరాల పట్ల  అవగాహన ఎంతో అవసరమని  వాట్సప్ టెలిగ్రామ్‌ల పట్ల  అప్రమత్తంగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు.