23-12-2025 12:00:00 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాం తి): పైప్‌లైన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్ డివిజన్ పద్మ కాలనీ ఫేస్ టు కాలనీలో రూ. 12.5 లక్షల వ్యయంతో తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. జనాభాకు అనుగుణంగా ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తాగునీటి నూతన పైప్లైన్ తో పాటు డ్రైనేజీ నిర్మాణ పనులను కూడా చేపడుతున్నామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జైసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సురేందర్, రాంనగర్ డివిజన్ ప్రెసిడెంట్ శంకర్ ముదిరాజ్, కార్యదర్శి దామోదర్ రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బబ్లు, కిషన్ రావు, వెంకటస్వామి గౌడ్, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, జనార్ధన్, షాప్ జనార్ధన్, జలమండలి అధికారి మేనేజర్ జ్యోతి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.