calender_icon.png 23 December, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామశాఖ అధ్యక్షుడి బహిష్కరణ

23-12-2025 01:06:36 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్22: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కాసర్లపాడు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బొల్లం లింగరాజుతో పాటు బుషిపాక రమేష్,గైగుల్ల శ్రవణ్,నల్లగుంట్ల రవి,వేముల ఉపేందర్,వద్ధిగళ్ల బన్నీ,బొల్లం శ్రీశైలంలను కాంగ్రెస్ పార్టీ నుండి తక్షణమే బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం తెలిపారు. సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాసర్లపాడు గ్రామంలో స్థానిక ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకున్నా,కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ప్రకటించిన అభ్యర్థి మంచాల లలితారామ్మూర్తి గెలుపును జీర్ణించుకోలేక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పార్టీ పరువు, ప్రతిష్టను భంగ పరిచినందుకు గాను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు తెలిపి వారి అనుమతితో  సోమవారం వారిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

సర్పంచ్,వార్డు సభ్యుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రజలపైకి కుర్చీలు పిసిరి, కత్తులతో దాడి చేసి పార్టీ పరువు ప్రతిష్టలను బంగ పరిచినందుకు పార్టీ నుండి బహిష్కరించినట్లు తెలిపారు.ఈరోజు నుండి పార్టీకి వారికి ఎలాంటి సంబంధం లేదని, వారిని ఎవరైన పార్టీలోని వ్యక్తులు ప్రోత్సహిస్తే వారిపై కూడా పీసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గ్రామశాఖ తాత్కాలిక అధ్యక్షుడిగా కూరాకుల యుగేందర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు దరూరి యోగా టనందచార్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, నర్సింగ శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్, నాయకులు వల్లాల ఖాజా,మండల ప్రవీణ్, బౌరోజు ఉపేందర్, సందీప్, అనిల్, బద్రి, మహంకాళి సురేష్ పాల్గొన్నారు.